Tuesday, 26 January 2021

ఎన్టీఆర్ ఆత్మీయుడితో సందీప్ కిషన్.. వైజాగ్‌లో సినిమా ప్రారంభం

వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడుకి మేనల్లుడు అయిన .. ‘ప్రస్థానం’తో పరిచయమై ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో సోలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి తెలుగు, తమిళ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. సొంతంగా వెంకటాద్రి టాకీస్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నారు. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సందీప్ కిషన్ మంగళవారం తన కొత్త సినిమాను ప్రారంభించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆప్తుడు, ఆయన పీఆర్‌వో అయిన మహేష్ కోనేరు నిర్మాతగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమా చేస్తున్నారు. వేదవ్యాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను మంగళవారం వైజాగ్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రైటర్‌ కోన వెంకట్‌ క్లాప్‌ కొట్టగా.. కంకట్ల సిల్క్స్‌ మల్లిక్‌ కెమెరా స్విచ్ ఆన్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మ‌హేష్ కోనేరు మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది సంక్రాంతికి మా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్షన్స్‌లో వ‌చ్చిన ‘మాస్టర్‌’తో మ‌రో సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను సొంతం చేసుకోవ‌డం ఆనందంగా ఉంది. అదే ఉత్సాహంతో ఈరోజు వైజాగ్‌లో కొత్త సినిమాను స్టార్ట్ చేశాం. డిఫ‌రెంట్ మూవీస్ చేయ‌డానికి ప్రాధాన్యత ఇచ్చే సందీప్‌ కిష‌న్‌తో మ‌రో వైవిధ్యమైన చిత్రాన్ని మా బ్యాన‌ర్‌లో రూపొందించబోతున్నాం. తన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. వేద వ్యాస్ ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం’ అని అన్నారు. కాగా, తన కొత్త సినిమా ప్రారంభమైనట్టు సందీప్ కిషన్ కూడా ట్వీట్ చేశారు. ‘‘నా స్నేహితుడు మహేష్ కోనేరు నిర్మాతగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్‌లో సినిమాను ప్రకటిస్తుండటం ఆనందంగా ఉంది. ఈ పిచ్చెక్కించే యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రతిభావంతుడైన వేదవ్యాస్ రచించి, దర్శకత్వం చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్. మా యంగ్ టీమ్‌ను ఆశీర్వదించిన కోనా వెంకట్ గారికి, మహేష్ తల్లిదండ్రులకు ధన్యవాదాలు’’ అని సందీప్ పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ohiPh9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...