Sunday, 24 January 2021

నందుకి ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ పెద్ద బ్రేక్ ఇవ్వాలి: సుధీర్ బాబు

నందు విజ‌య్‌కృష్ణ హీరోగా, యాంక‌ర్ ర‌ష్మి హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బ‌స్టర్‌’. ఈ చిత్రాన్ని విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రాజ్ విరాట్ దర్శకుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. అలాగే, ఈ మూవీ ఆల్బమ్ నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా నుంచి మరో పాటను ఆదివారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘నడుకుడి రైటంటి సోదరా’ అంటూ సాగే ఈ పాటను హీరో సుధీర్ బాబు విడుదల చేశారు. ‘మెంట‌ల్ మ‌దిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల ద్వారా విజయాలను అందుకుని ప్రస్తుతం నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా ‘అంటే సుంద‌రానికీ’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న ద‌ర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ పాటకు సాహిత్యం అందించారు. మలయాళ గాయని వైకామ్ విజయలక్ష్మి ఆలపించారు. పాటను విడుదల చేసిన సంద‌ర్బంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా టీజ‌ర్ చూసినప్పుడే ప్రామిసింగ్‌గా అనిపించింది. ఈ చిత్రంలో నందు కొత్తగా క‌నిపిస్తున్నాడు. క్యారెక్టర్ కూడా ఇంట్రస్టింగ్‌గా వుంది. ఇప్పుడు నాతో రెండో పాటను లాంచ్ చేయించారు. ఈ సాంగ్‌కి ప్రత్యేక‌త ఉంది. అదేంటంటే.. ‘మెంట‌ల్ మ‌దిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల‌తో చాలా మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించ‌టం. వివేక్ ఆత్రేయ సినిమాలు చూశాను. చాలా నేచుర‌ల్‌గా తీసి మెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆయ‌న్లో మ‌రో యాంగిల్ ఇది. ఈ పాట‌లో ఆయ‌న రాసిన లిరిక్స్ న‌న్ను బాగా ఆక‌ట్టుకున్నాయి. మ‌ల్టిటాలెంటెడ్ ద‌ర్శకుడు వివేక్ ఆత్రేయ‌. ఇలా మ‌ల్టిటాలెంటెడ్ ప‌ర్సన్స్ ఇండ‌స్ట్రీకి రావ‌టం శుభ‌ప‌రిణామం. అంతేకాకుండా ఈ పాట‌ని ప్రముఖ సింగ‌ర్ వైకామ్ విజ‌య‌ల‌క్ష్మి గారు పాడ‌టం హైలెట్‌గా నిలిచింది. ఈ చిత్రం నందుకి, ద‌ర్శకుడు రాజ్ విరాఠ్‌కి పెద్ద బ్రేక్ ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను. నిర్మాతలకి చాలా మంచి ప్రాఫిట్స్ రావాల‌ని వారు మ‌రిన్ని చిత్రాలు తీయాల‌ని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. కాగా, ఈ చిత్రంలో కిరీటి, రఘు కుంచె ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి సుజాతా సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NAkjGZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...