Sunday, 31 January 2021

షూటింగ్ సెట్‏లో సేఫ్‏గా అనిపించలేదు.. ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

గ్లోబల్‌స్టార్‌ బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ సినిమాల్లోనూ సత్తా చాటుతున్నారు. తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రియుడు నిక్ జోనాస్‌ని పెళ్లాడిన ఆమె, మ్యారేజ్ తర్వాత కూడా కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె నటించిన లేటెస్ట్ మూవీ '' ఇటీవలే విడుదలై సక్సెస్ సాధించింది. అయితే తాజాగా ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు ప్రియాంక. తాను పెద్ద చదువు చదివి ఇంజనీర్ కావాలని అనుకున్నానని, కానీ అనూహ్యంగా తన అడుగులు సినీ ఇండస్ట్రీ వైపు పడటంతో ఇలా సెట్టయ్యానని తెలిపారు. 2000 సంవత్సరం అందాల పోటీలో పాల్గొన్న తాను ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నాక వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయని ఆమె చెప్పారు. ఆ సమయంలో తనకు సినిమాల గురించి తనకు పెద్దగా అవగాహన కూడా లేదని పేర్కొన్న ప్రియాంక.. నటనకు సంబంధించిన ఎన్నో మెళకువలను షూటింగ్స్ జరుగుతుండగానే నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. అలా అలా సినీ ఇండస్ట్రీలో తాను నిలదొక్కుకొని స్టార్‌గా ఎదిగానని.. తనకు ఈ పరిశ్రమ బాగా సూట్ అయిందని ప్రియాంక అన్నారు. ఇక లాక్‌డౌన్ తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనడంపై స్పందించిన ప్రియాంక చోప్రా.. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్స్ జరిగే లొకేషన్స్‏లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, అయినప్పటికీ షూటింగ్ సెట్‏లో సేఫ్‏గా ఫీల్ కాలేకపోయానని ప్రియాంక తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cqaWUz
v

No comments:

Post a Comment