Tuesday, 19 January 2021

సోనూ సూద్ పేరిట ఉచిత అంబులెన్స్ సర్వీస్.. ట్యాంక్ బండ్ శివకు అండగా రియల్ హీరో

ప్రముఖ నటుడు పేరిట హైదరాబాద్‌లో ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రజలకు సుపరిచితమైన ట్యాంక్ బండ్ శివ ఈ ఉచిత అంబులెన్స్‌ సర్వీసును నడపనున్నారు. ఈ అంబులెన్స్ సర్వీస్‌ను నటుడు సోనూ సూద్ స్వయంగా మంగళవారం ట్యాంక్ బండ్‌పై ప్రారంభించారు. ఈ అంబులెన్స్ ద్వారా జంట నగరాల్లోని పేద ప్రజలకు సేవలు అందించనున్నారు ట్యాంక్ బండ్ శివ. దాతల సహాయంతో ఈ అంబులెన్స్‌ను కొనుగోలు చేశానని, తనకు స్ఫూర్తి ప్రదాత అయిన సోనూ సూద్ పేరును ఈ అంబులెన్స్‌కు పెట్టుకున్నానని శివ వెల్లడించారు. హైదరాబాద్ వాసులకు సుపరిచితమైన శివ నిరుపేద. హుస్సేన్ సాగర్ ఏరియాలో శవాల శివగా పేరుగాంచిన శివ.. సాగర్‌లో గల్లంతైన మృతదేహలను వెలికి తీయండంలో లేక్ పోలీసులకు సహకరిస్తున్నారు. గత 23 ఏళ్లలో హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన 114 మంది ప్రాణాలను ఆయన కాపాడారు. అంతేకాదు, తనకు నిలువ నీడ లేకపోయినా ఇతరులకు సాయం చేయడానికి ముందుంటున్నారు శివ. శివ గురించి తెలిసి ఎవరైనా ఆయనకు సాయం చేసినా దాన్ని సామాజిక సేవకే ఉపయోగిస్తున్నారాయన. శివ చేస్తున్న సేవ గురించి తెలుసుకుని కిందటేడాది ఒక దాత ఆయనకు మారుతీ సుజుకి ఈకో వాహనం కొనిచ్చారు. ఈ వాహనాన్ని ఉచిత అంబులెన్స్‌గా మార్చి సేవ చేస్తున్నారు శివ. అయితే, ఒక్క వాహనంతో తాను ఒకేసారి ఇద్దరికి సహాయం చేయలేకపోతున్నానని.. అందుకే దాతల సహాయంతో మరో వాహనాన్ని కొనుగోలు చేశానని శివ చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి సేవ చేసి తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచిన సోనూ సూద్ పేరును ఈ అంబులెన్స్‌కు పెట్టానని అన్నారు. తనకు సోనూ సూద్ సహాయం అందిస్తానని హామీ ఇచ్చారని.. ఇల్లు లేదని తెలుసుకుని ఆయన కట్టించి ఇస్తానన్నారని శివ వెల్లడించారు. సోనూ సూద్‌తోనే అంబులెన్స్‌ను ప్రారంభిస్తానని ఇప్పటికే చెప్పిన శివ.. మంగళవారం తన కోరిక తీర్చుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sFZB8n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...