Wednesday, 6 January 2021

కాలి నడకన తిరుమల కొండెక్కిన హీరో నితిన్.. సెల్ఫీల కోసం పోటీపడిన జనం

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం హీరో తిరుమల వెళ్లారు. భార్య షాలినితో కలిసి బుధవారం ఉదయం నితిన్ హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరి వెళ్లారు. అయితే, కాలి నడకన మాత్రం ఒక్కరే వెళ్లారు. నితిన్ భార్య షాలిని కారులో తిరుమల చేరుకున్నారు. కాగా, నితిన్ కాలి నడకన తిరుమల వెళ్తున్న వీడియోను ఒక అభిమాని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోను రీట్వీట్ చేసిన నితిన్.. ‘‘ఓం నమో వెంకటేశాయ’’ అని రాశారు. కాగా, నితిన్ కాలి నడకన వస్తుండటంతో చూసి ఆశ్చర్యపోయిన కొంత మంది భక్తులు ఆయనతో సెల్ఫీలు తిగడానికి పోటీ పడ్డారు. నితిన్ వేగంగా నడుచుకుంటూ వెళ్తుండగానే అభిమానులు తమ సెల్‌ఫోన్లతో సెల్ఫీలు దిగుతున్నారు. అయితే, రేపు తెల్లవారుజామున వీవీఐపీ బ్రేక్ దర్శన సమయంలో నితిన్ దంపతులు స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఇదిలా ఉంటే, నితిన్ హీరోగా నటించిన ‘రంగ్ దే’ విడుదలకు సిద్ధమవుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ పనిచేయడం విశేషం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో పాటు ‘చెక్’, ‘అంధాదున్’ రీమేక్‌లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నితిన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3beCJqg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...