Friday, 1 January 2021

ANIMAL: బాలీవుడ్ స్టార్ హీరోతో అర్జున్ రెడ్డి డైరెక్టర్ మూవీ టైటిల్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్

'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అదే సినిమాను 'కబీర్ సింగ్' పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఆయన చిత్రం ఎవరితో ఉండబోతోంది అనే దానిపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సందీప్‌తో బాలీవుడ్ స్టార్ హీరో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. క్రైం డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీకి 'ఏనిమల్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ న్యూ ఇయర్ సందర్భంగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా. తాజాగా ఏనిమల్ టైటిల్ లోగోతో పాటు, సినిమా గురించిన వివరాలను తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భూషణ్ కుమార్, కిషన్ కుమార్ కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. క్రైమ్ డ్రామాకు వినోదాత్మక సన్నివేశాలను జోడించి ఈ సినిమాలో చుపించావుతున్నామని దర్శకుడు సందీప్ రెడ్డి తెలిపారు. మొదటి నుంచే సందీప్ చేయబోతున్న ఈ సినిమాకు ఏనిమల్ అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు విన్నాం కానీ హీరో సల్మాన్ ఖాన్ చేయనున్న ఓ మూవీ కారణంగా ఈ టైటిల్ పెట్టడం లేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టేస్తూ తాజాగా 'ఏనిమల్' టైటిల్‌ని అధికారికంగా ప్రకటించారు సందీప్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38OCtLX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...