Wednesday, 13 January 2021

Alludu Adhurs Twitter review: సంక్రాంతి అల్లుడిపై ఆడియన్స్ ఫీలింగ్స్ చూస్తే..

యంగ్ హీరో హీరోగా రూపొందిన కొత్త సినిమా ''. చిత్రానికి సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వహించగా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. సోనూ సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం బాణీలు కట్టారు. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ 'అల్లుడు అదుర్స్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈ రోజు (జనవరి 14న) ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే గత రాత్రి ఓవర్‌సీస్‌లో ఈ మూవీ ప్రదర్శించ బడటంతో అక్కడి తెలుగు ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా సినిమాపై అభిప్రాయలు తెలుపుతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు అల్లుడు అదుర్స్ మూవీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే టాక్ ఓవర్‌సీస్ నుంచి వినిపిస్తోంది. సంక్రాంతి అల్లుడి కామెడీ కూడా బాగానే ఉందని అంటున్నారు. స్క్రిప్ట్ చాలా బాగుందని, క్లాసీ వేలో ఆ స్క్రిప్ట్ ప్రెజెంట్ చేశారని తెలుస్తోంది. కాకపోతే ఈ అల్లుడి కథను దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కాస్త స్లోగా నేరేట్ చేశాడని ట్వీట్స్ వస్తున్నాయి. ఇకపోతే ఈ అల్లుడు అదుర్స్ మూవీ బెల్లంకొండ సురేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని కొన్ని ట్వీట్స్ వస్తుంటే.. అక్కడక్కడా ఫ్లాప్ మూవీ అనే ట్వీట్స్ కూడా కనిపిస్తున్నాయి. యూఎస్‌ ప్రీమియర్ షోస్ ఆధారంగా మొత్తంగా చూస్తే ఈ సంక్రాంతి అల్లుడు మిశ్రమ స్పందన తెచ్చుకున్నాడనేది అర్థమవుతోంది. దేవీ శ్రీ బాణీలు మరోసారి మ్యాజిక్ చేస్తూ మ్యూజిక్ ప్రియులను ఆకర్షించాయని సమాచారం. మరి అల్లుడు అదుర్స్ ఫస్టాఫ్ పర్‌ఫార్‌మెన్స్ ఎలా ఉంది? సెకండాఫ్‌లో ట్విస్టులేంటి? క్లైమాక్స్, కామెడీ ఎలా ఉందనేది మరి కొన్ని గంటల్లో 'సమయం' నుంచి రాబోయే పూర్తి రివ్యూలో చూడండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bDOcQj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...