Tuesday, 26 January 2021

సందీప్ కిషన్ ‘A1 ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్: స్పోర్ట్స్ బిజినెస్ అయ్యి చాలా కాలమైంది!

హాకీ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ‘చక్‌దే’. ఈ సినిమాతో హాకీ క్రీడ గొప్పతనం గురించి చాలా మందికి తెలిసిందంటే అతిశయోక్తి కాదు. ‘చక్‌దే’ తరవాత మళ్లీ అలాంటి సినిమా రాలేదు. ఇప్పుడు అలాంటి అనుభూతిని కలిగించేందుకు యంగ్ హీరో సిద్ధమైపోయారు. ఆయన హీరోగా నటించిన న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘A1 ఎక్స్‌ప్రెస్‌’. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌. తెలుగులో వస్తోన్న తొలి హాకీ నేపథ్య చిత్రమిది. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ట్రైలర్ వచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళవారం ‘A1 ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. స్వతంత్ర భారతదేశం తొలి హాకీ ప్రపంచకప్‌ను గెలుచుకుంది.. హాకీని జాతీయ క్రీడగా భారతదేశం ప్రకటించింది అనే వార్తా కథనాలతో ట్రైలర్‌ను ప్రారంభించారు. ‘ఇండియాలో సగం మంది హాకీ కోచ్ అంటే ఇంకా షారుఖ్ ఖానే అనుకుంటున్నారయ్యా బాబు’ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగు సినిమాలో హ్యూమర్‌ను కూడా పరిచయం చేసింది. ఇక హాకీ ప్లేయర్‌గా సందీప్ కిషన్ లుక్ అదిరిపోయింది. ఇక ఒక ఆటగాడు దేశానికి ఆడటానికి పడే కష్టాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘మన దేశంలో స్పోర్ట్స్‌మ్యాన్‌కు ఇవ్వాల్సిన కనీసం గౌరవం కూడా ఇవ్వడంలేదు సార్. ఇక్కడ స్పోర్ట్స్ బిజినెస్ అయ్యి చాలా కాలమైంది. ఏ స్పోర్ట్ చూడాలో ఏ స్పోర్ట్ చూడకూడదో బిజినెస్ మ్యానే డిసైడ్ చేస్తున్నాడు. అసలు ఇక్కడ ఆడాలంటేనే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది సార్’ అంటూ సందీప్ కిషన్ చెప్పే డైలాగు సినిమాలో ఎమోషన్‌ను చెబుతోంది. ఇక లావణ్యతో సందీప్ కిషన్ రొమాన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఒక లిప్ లాక్ కూడా లాగినట్టున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇదొక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని ట్రైలర్ చెబుతోంది. సందీప్ కిషన్ 25వ చిత్రంగా రూపొందిన ‘A1 ఎక్స్‌ప్రెస్’ ఫిబ్రవరిలో థియేటర్లలోకి వస్తోంది. ఈ చిత్రంలో రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ, పోసాని కృష్ణముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్య, రాహుల్ రామ‌కృష్ణ, మ‌హేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్‌, భూపాల్‌, ఖ‌య్యుమ్‌, సుద‌ర్శన్‌, శ్రీ‌రంజ‌ని, ద‌యా గురుస్వామి ఇతర పాత్రల్లో నటించారు. హిపాప్ తమిళ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YiBgrr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...