Saturday, 9 January 2021

A1 ఎక్స్‌ప్రెస్‌ ఫస్ట్‌లుక్.. తెలుగు‌లో ఈ తరహా కథతో రాబోతున్న మొట్టమొదటి సినిమా ఇదే!!

యంగ్ హీరో తాజా సినిమా 'A1 ఎక్స్‌ప్రెస్'. ఈ సినిమా కోసం ఆశ్చర్యపర్చేలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు సందీప్ కిషన్. సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారి కండలు పెంచేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో షర్ట్ లేకుండా కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు సందీప్ కిషన్. చేతిలో ఇండియన్ జెర్సీతో పాటు హాకీ స్టిక్ ఉన్నాయి. తెలుగులో హాకీ నేపథ్యంలో రానున్న తొలి సినిమా ఇదే అంటూ ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ షేర్ చేశాడు సందీప్ కిషన్. సందీప్ కెరీర్‌లో 25వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో ఆయన సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రంలో హాకీ ప్లేయర్‌గా సందీప్ కనిపించబోతున్నాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయా పన్నెం నిర్మిస్తుండగా.. డెన్నిస్‌ జీవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సో.. చూడాలి మరి ఈ ప్రయోగాత్మక సినిమా సందీప్ కేరీర్‌ని ఎలా మలుపుతిప్పుతుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3opBkku
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...