వరుస పరాజయాల తర్వాత 'చిత్రలహరి' సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కిన .. ప్రేమకథా చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే 'ప్రతిరోజూ పండగే'తో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు '' అంటున్నాడు. సగటు వ్యక్తికి బ్యాచిలర్ లైఫ్ లోనే అసలు కిక్ ఉంటుందని చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్ర టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది. 'సున్‌లో సున్‌లో జస్ట్ బీ సోలో.. బోలో బోలో బ్యాచ్‌లర్.. సోలో బతుకే సో బెటర్' అంటూ ప్రారంభమైన ఈ పాటలో బ్యాచిలర్ లైఫ్ గొప్పతనాన్ని చెబుతూ 'పెళ్లి చాలా డేంజర్' అస్సలు ఇరుక్కోవద్దు అనే మెసేజ్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాయగా, ఎస్ఎస్ థమన్ బాణీలు కట్టారు. ఇక ఈ సాంగ్‌ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న మెగా మేనల్లుడు ''సాటి సోలో సోదర సోదరియమణులకు విరాట్ చెప్పేది ఏంటంటే.. సోలో బ్రతుకే సో బెటర్.. మన సింగిల్స్ అందరికి అంకితం'' అని పేర్కొనడం విశేషం. సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంలో విరాట్ అనే పాత్రలో నటించగా, అమృత పాత్రను పోషించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందిన ఈ 'సోలో బతుకే సో బెటర్' సినిమాకు నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించాడు. బివిఎస్‌యెన్ ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటించింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/340zD4I
v
No comments:
Post a Comment