Friday, 4 December 2020

Prabhas:'సలార్' అర్థం చెప్పిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌‌తోనే చేయడానికి రీజన్ ఇదే అంటూ!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘కె.జి.యఫ్’ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్ రూపొందించబోతున్న భారీ సినిమా ''. హోంబలే ఫిలింస్ పతాకంపై పాన్ ఇండియా సినిమాగా భారీ రేంజ్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. రెండురోజుల క్రితం ఈ సినిమాను ప్రకటిస్తూ ప్రభాస్ లుక్‌తో కూడిన పోస్టర్ రిలీజ్ చేయడంతో యావత్ సినీ లోకం చూపు ఈ సినిమాపై పడింది. సినిమా అనౌన్స్ అయిన క్షణం నుంచే సోషల్ మీడియాలో 'సలార్' టైటిల్ ట్రెండ్ అవుతోంది. దీంతో 'సలార్' అంటే అర్థమేంటి? ఈ పేరు ఎందుకు పెట్టారనే కోణంలో జనాల్లో చర్చలు మొదలయ్యాయి. సలార్ అంటే అర్థం ఇదే అంటూ రకరకాల ఉహాగానాల్లో తేలిపోతున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించిన డైరెక్టర్ .. 'సలార్' అంటే అర్ధమేంటో క్లారిటీగా చెప్పేస్తూ ఇందులో ప్రభాస్‌ని ఎందుకు హీరోగా తీసుకున్నామనే విషయాన్ని వెల్లడించారు. సలార్ అనేది ఉర్దూ పదం. సమర్థవంతమైన నాయకుడని ఈ పదానికి అర్థం అని పేర్కొన్నారు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌నే ఎందుకు తీసుకున్నారని చాలా మంది సడుగుతున్నారని చెప్పిన డైరెక్టర్.. దానిపై కూడా వివరణ ఇచ్చారు. తన కథకు ప్రభాస్ కరెక్ట్‌గా సరిపోతాడని, అమాయకంగా ఉండే వ్యక్తి కరడుగట్టిన నాయకుడిగా ఎలా మారాడో ఈ సినిమాలో చూపించబోతున్నామని అన్నారు. అమాయకత్వాన్ని, రౌద్రాన్ని అద్భుతంగా పండించగలిగే హీరో ప్రభాస్ కాబట్టి ఆయన్నే హీరోగా కన్ఫర్మ్ చేశామని ప్రశాంత్ నీల్ తెలిపారు. Also Read: వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తామని చెప్పిన చిత్రయూనిట్.. అన్ని హంగులతో భారతీయ భాషలన్నింటిలో రూపొందిస్తాం అని తెలిపారు. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్' మూవీ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' కమిటై ఉన్నారు ప్రభాస్. ఇంతలో 'సలార్' అనౌన్స్‌మెంట్ కూడా రావడంతో వీటిలో ఏ మూవీ ముందు సెట్స్ పైకి రానుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39HsSIT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...