Wednesday, 2 December 2020

Neelya Bhavani: ‘ఛత్రపతి’ చంద్రశేఖర్‌ భార్య కూడా పెద్ద నటి.. పెద్దలను ఎదిరించి ప్రేమపెళ్లి

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతి సినిమాలోనూ ఓ నటుడు కనిపిస్తుంటాడు. ఆయన పేరు చంద్రశేఖర్. ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న ఆయన ‘ఆర్ఆర్ఆర్‌’లోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆర్టిస్టుగా ‘ఛత్రపతి’ సినిమా చంద్రశేఖర్‌కు మంచిపేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి నటుడిగా నిలదొక్కుతున్న ఆయన వందలాది సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే నటుడిగా అందరికీ పరిచయమున్న చంద్రశేఖర్ వ్యక్తిగత జీవితం గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆయన భార్య కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్‌. Also Read: చంద్రశేఖర్ భార్య పేరు నిలీయ భవాని. పండగ చేస్కో, కిక్2, సైరా నరసింహారెడ్డి, జెంటిల్‌మెన్.. లాంటి చాలా సినిమాల్లో ఆమె నటించింది. తమిళంలోనూ అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం కొన్ని సీరియళ్లలోనూ నటిస్తూ చాలా బిజీగా ఉంది. ఖమ్మం జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌ను ప్రేమించింది. ఆ సమయంలో చంద్రశేఖర్‌ నటుడిగా నిలదొక్కుకోకపోవడంతో భవానీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరు హైదరాబాద్‌ వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. అదే సమయంలో రాజమౌళి తెరకెక్కించిన ‘శాంతి నివాసం’ సీరియల్‌లో చంద్రశేఖర్‌కు చిన్న పాత్ర దక్కింది. Also Read: ఆ తర్వాత స్టూడెంట్ ‘నం.1’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి వరుస అవకాశాలు రావడంతో బిజీగా మారిపోయాడు. భర్త అడుగుజాడల్లో నీలియా భవానీ కూడా ఇండస్ట్రీలోకి ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకుంది. వీరికి ఓ కుమారుడు మహేశ్వరన్, కుమార్తె పూజిత ఉన్నారు. కొన్నాళ్లపాటు హ్యాపీగానే సాగిన వీరి దాంపత్య జీవితం ఒడిదుడుకులకు గురైంది. మనస్పర్థలతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం భవానీ పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. పూజిత మెడిసిన్ చదువుతుండగా, మహేశ్వరన్ క్రికెటర్‌గా స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇదీ చంద్రశేఖర్ రియల్ స్టోరీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mqlu8e
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...