Saturday, 12 December 2020

Narappa: వెరీ సీరియస్ వెంకటేష్.. విక్టరీ హీరోలో కొత్త కోణం.. అంచనాలు పెంచేసిన 'నారప్ప' ఫస్ట్ గ్లింప్స్

దగ్గుబాటి వారసుడు, విక్టరీ వెంకటేష్‌ను సీరియస్ లుక్‌లో చూపించి ఆకట్టుకుంది '' టీమ్. రేపు (డిసెంబర్‌ 13) వెంకటేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ చిత్ర గ్లింప్స్‌ విడుదల చేసి సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశారు. కేవలం 26 సెకనుల ఈ వీడియోలో వెంకీ యాక్షన్‌ని మాత్రమే హైలైట్ చేస్తూ చూపించి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. 'నారప్ప' ఫస్ట్ గ్లింప్స్ మీతో పంచుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. తమిళంలో ధనుష్ నటించిన 'అసురన్'కు రీమేక్‌గా తెలుగులో ఈ 'నారప్ప' రూపొందుతోంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. , హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వెంకీ కెరీర్‌లో 74వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read: లాక్‌డౌన్‌‌కి ముందే 75 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో సుందరమ్మగా తెలుగు వారికి చిరకాలం గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు హీరోయిన్ ప్రియమణి. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనుంది చిత్రయూనిట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oKRZyF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...