Thursday, 24 December 2020

Krack: కోరమీసం పోలీసోడా అంటూ శృతి హాసన్.. రవితేజతో కెమిస్ట్రీ అదుర్స్

మాస్ మహారాజ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ''. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండటం విశేషం. గత కొన్ని రోజులుగా విడుదల చేస్తున్న ఈ సినిమా అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆతృతను పెంచేశాయి. ఈ క్రమంలో క్రిస్మస్ కానుకగా ఈ మూవీ నుంచి 'కోరమీసం పోలీసోడా' లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. 'కోరమీసం పోలీసోడా.. నన్ను కొంచెం చేసుకోరా' అంటూ సాగిపోతున్న ఈ పాటకు రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ రాశారు. ప్రముఖ సింగర్ రమ్య బెహ్రా అద్భుతంగా ఆలపించింది. ఇక థమన్ అందించిన బాణీలు రొమాంటిక్ ఫీల్ తెప్పిస్తూ పాటకే అందం తీసుకొచ్చాయి. ఖాకీ డ్రెస్ కారణంగా భర్త తనతో కాస్త సమయం గడపలేకపోతున్నాడనే ఫీలింగ్‌తో హీరోయిన్ పాడే ఈ పాట డీసెంట్ మెలొడీగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో రవితేజ- శృతి హాసన్ కెమిస్ట్రీ హైలైట్ అవుతోంది. అంతకుముందు రవితేజ- గోపీచంద్ మ‌లినేని కాంబోలో వచ్చిన ''డాన్‌ శీను, బలుపు'' చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అదే కాంబోలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ 'క్రాక్'పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు వరుసగా రిలీజ్ అవుతున్న అన్ని అప్‌డేట్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సంక్రాంతి కానుకగా క్రాక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JijKQ6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...