ఈ ఏడాది (2020) చిత్రసీమలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు ప్రేక్షకలోకాన్ని కలవరపెడుతున్నాయి. ఓ విషాదం తాలూకు జ్ఞాపకాలు మరవకముందే మరో విషాద వార్త వినాల్సి వస్తోంది. తాజాగా సీనియర్ దర్శకుడు, నటుడు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 79 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేడు (డిసెంబర్ 25) తుదిశ్వాస విడిచారు. నాటకరంగం నుంచి సినీరంగానికి వచ్చిన ఆయన దర్శకత్వ శాఖలో కృష్ణ, విజయనిర్మల, వి.రామచంద్రరావు, కె.హేమాంబదరరావు, కె.ఎస్.ఆర్. దాస్ తదితరుల దగ్గర పలు చిత్రాలకు పనిచేశారు. అనంతరం ''కన్నెవయసు, లవ్ ఇన్ సింగపూర్'' చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో రీమేక్ మూవీస్ రూపొందించడంలో ఆయన మంచి సంపాదించారు. 'లవ్ ఇన్ సింగపూర్' చిత్రంలో చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పలువురు ప్రముఖ హీరోల చిత్రాలలో నటుడిగా కూడా కనిపించి తన అభిరుచిని చాటుకున్నారు ఓఎస్ఆర్ ఆంజనేయులు. దాదాపు 70కి పైగా చిత్రాలలో ఆయన నటించారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. ఓఎస్ఆర్ ఆంజనేయులు మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o14rdy
v
No comments:
Post a Comment