Sunday, 20 December 2020

తెలంగాణలో సోనూసూద్‌కి గుడి.. పూజలు చేస్తున్న గిరిజనులు

లాక్‌డౌన్‌లో వేలాది కార్మికులను ఆదుకోవడంతో సినీనటుడు ఇప్పుడు అందరికీ రియల్ హీరోగా మారిపోయారు. ఆపన్నులకు సాయం చేసేందుకు ఆయన తన ఆస్తులు కూడా తాకట్టు పెట్టాడని ఇటీవల వెలుగులోకి ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సినిమాల్లో విలన్ వేషాలు వేస్తూ హీరోలతో దెబ్బలు తినే సోనూసూద్‌ నిజ జీవితంలో మాత్రం తాను హీరోనేనని నిరూపించుకున్నాడు. దీంతో దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే కష్టం వస్తే స్థానిక నాయకులకో, అధికారులకో, అక్కడి ప్రభుత్వాలకో చెప్పుకోకుండా సోనూ‌కి ఒక్క ట్వీట్ పెడుతున్నాడు. దీంతో ఆయన నేనున్నానంటూ ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సోనూసూద్‌కు ప్రజలు ఏకంగా గుడి కట్టేశారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బ తండాలో సోనూసూద్‌కు గుడి కట్టారు అక్కడి గిరిజనులు. సోనూసూద్ లక్షలాది మందికి చేస్తున్న సాయాన్ని చూసి తాము ఆయన్ని దేవుడిగా భావిస్తున్నామని, అందుకే గుడి కట్టాడని స్థానికులు చెబుతున్నారు. కలియుగ దానకర్ణుడికి గుడి కట్టడం తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని అక్కడి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Wy2Zn1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...