Saturday, 26 December 2020

'పుష్ప' విలన్ కన్ఫర్మ్! భారీ మూవీలో అల్లు అర్జున్‌ని ఢీకొట్టబోతున్న ఆర్య

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ''. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించిన ఓ క్రేజీ అప్‌డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్రంలో విలన్‌గా ఆర్యను కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. మొదట 'పుష్ప' మూవీ కోసం తమిళ హీరో విజయ్ సేతుపతిని విలన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ బిజీ షెడ్యూల్ వల్ల డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నారని తెలిసింది. దీంతో అప్పటినుంచి మరో విలన్ కోసం వెతుకుతున్న సుక్కు.. ఇటీవలే ఆర్యతో సంప్రదింపులు జరిపి ఓకే చేశారని సమాచారం. గతంలో అల్లు అర్జున్‌తో కలిసి ‘వరుడు’ సినిమాలో ఆర్య నటించారు. దీంతో మరోసారి వీరిద్దరూ కలిసి తెరపంచుకోనున్నారనే విషయం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదే జరిగితే ఆర్య పదేళ్ల తర్వాత తెలుగులో ఈ చిత్రం తోనే రీ ఎంట్రీ ఇచ్చినట్లవుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో డిఫరెంట్ గెటప్‌తో కనిపించనున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఆరుగురు యూనిట్ సభ్యులకు కరోనా సోకటంతో చిత్రీకరణ వాయిదా పడిన విషయం తెలిసిందే. అతి త్వరలో తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారు సుకుమార్. ఇక ఈ మూవీ పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ ప్రారంభం కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nVxlMc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...