Monday, 7 December 2020

శ‌ర్వానంద్ ఇంటెన్స్ డ్రామా 'మ‌హాస‌ముద్రం' రెగ్యుల‌ర్ షూటింగ్ షురూ

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న చిత్రం ''. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచే అటు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో, ఇటు ప్రేక్ష‌కుల్లో ఓ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు (సోమవారం) నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు మేకర్స్. హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఫ‌స్ట్ షెడ్యూల్ మొదలైంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా 'మ‌హాస‌ముద్రం' టైటిల్ పోస్ట‌ర్‌ షేర్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి‌.. "ఈ ఉద్రేక‌భ‌రిత ల‌వ్ స్టోరీని, అసాధార‌ణ క్యారెక్ట‌రైజేష‌న్స్‌తో కూడిన ఇంటెన్స్ డ్రామాను చూపించ‌డానికి కుతూహ‌లంతో ఎదురుచూస్తున్నాను. ఇలాంటిది మీరెప్పుడూ అనుభ‌వించి ఉండ‌రు! మీరంతా త‌ప్ప‌కుండా ఈ మూవీ ఇష్టపడతారు. ఈ రోజు షూటింగ్ స్టార్ట్ చేశామని చెబుతూ సంతోషిస్తున్నాను'' అని తెలిపారు. Also Read: మరోవైపు హీరో సిద్ధార్థ్ సైతం త‌న ఆనందాన్ని పంచుకుంటూ.. ''నేను ఓ డిఫ‌రెంట్ క‌థ‌కు వెళ్తున్నా. నా బేబీ నోరి త‌న డాడీకి బై చెబుతోంది. పంచుకోవ‌డానికి చాలా ఉన్నాయి. ట‌చ్‌లో ఉంటే చెప్తా" అని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో రాసుకొచ్చారు. ఈ సినిమాలో అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. చైత‌న్ భ‌రద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ పోషిస్తున్న పాత్ర సినిమాకే మేజర్ అట్రాక్షన్ అవుతుందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37HVkYl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...