నట సింహం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న ఆయన కోసం మరో రెండు కథలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బోయపాటి శ్రీనుతో ఆయన నటిస్తున్న సినిమా కోసం హీరోయిన్ల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలామంది పేర్లు బయటికి వచ్చినా ఎవరూ ఫిక్స్ కావడం లేదు. ప్రస్తుతం బాలయ్య సినిమాలో నటించేందుకు సైతం నిరాకరించిందన్న వార్త హల్‌చల్ చేస్తోంది. Also Read: లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో నటించిన సోనాల్ బాగానే మెప్పించింది. అంతేకాకుండా బాలయ్యకు ఆమె లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. వచ్చిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకున్న ఈ హాట్ భామ బికినీలో అందాలు ఆరబోస్తూ బాగానే కష్టపడింది. అందువల్లే బాలయ్య తాజా తన సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారట. దీంతో యూనిట్ ఆమెను సంప్రదించగా నో చెప్పేసిందట. దీంతో షాకైన యూనిట్ సభ్యులు మరో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రయాగ మార్టిన్, సాయేషా సైగల్ పేర్లు వినిపించినా ఒక్కరు కూడా ఫైనల్ కాలేదు. చివరికి మెయిన్ హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. మరో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదిస్తే సోనాల్ హ్యాండ్ ఇచ్చిందట. చివరికి బాలయ్యతో నటించే అవకాశం ఎవరు దక్కించుకుంటారో చూడాలి మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VN9EcO
v
No comments:
Post a Comment