Monday, 21 December 2020

అరియానా తోపు అంటూ రెచ్చిపోయిన స్నేహితులు.. బోల్డ్ బ్యూటీకి ఘన స్వాగతం పలుకుతూ రచ్చ రచ్చ

అసలు మొదలవుతుందో లేదో అనే సందేహాల నడుమ ప్రారంభమై.. మొదట కాస్త చప్పచప్పగా నడిచిన ముగింపుదశకు వచ్చేసరికి ఓ రేంజ్‌లోకి వెళ్లి బుల్లితెర ఆడియన్స్ అందరినీ టీవీలకు అతుక్కునేలా చేసింది. చివరిదాకా వచ్చిన ఐదుగురు పార్టిసిపెంట్స్‌లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు కాబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే నిన్న (ఆదివారం) మెగాస్టార్ ముఖ్య అతిథిగా జరిగిన రసవత్తరంగా ముగిసింది. ఈ సారి బిగ్ బాస్ విన్నర్‌గా అభిజీత్ ట్రోఫీ అందుకున్నారు. ఇక మొదటిరోజు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరై ఫైనల్ రేస్ వరకూ కొనసాగింది బోల్డ్ బ్యూటీ అరియానా. హౌస్‌లో ఆమె చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో గ్రాండ్ ఫినాలే ముగించుకొని హౌస్ నుంచి ఇంటికి చేరిన అరియానాకు ఘన స్వాగతం లభించింది. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా కలిసి అరియానా.. అంటూ కేకలు పెడుతూ ఆమెను ఇంట్లోకి ఆహ్వానించారు. అరియానా తన ఫ్లాట్‌కు చేరుకోగానే స్నేహితులంతా తీన్మార్ డ్యాన్సులతో స్వాగతం పలికారు. అరుపులు, కేరింతలతో హుషారెత్తిపోయారు. ఆమె ఇంటిని దీపాలతో అందంగా అలంకరించి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. అరియానా తోపు.. అరియానాకు జై భోలో, అరియానా సూపర్ స్టార్ అంటూ కేకలు పెట్టారు. 'అరియానా అరియానా నీతో పెట్టుకొంటే.. అందరికి తందాన' అంటూ రచ్చ రచ్చ చేశారు. ఈ కార్యక్రమంలో అవినాష్ కూడా పాల్గొన్నాడు. Also Read: స్నేహితులు ఇచ్చిన ఈ గ్రాండ్ పార్టీ చూసి అరియానా తెగ మురిసిపోయింది. ఇంట్లోకి చేరుకోగానే కాస్త ఎమోషనల్ అయిన అరియానా.. హౌస్‌లో ఉండగా తనను అవినాష్ బాగా సపోర్ట్ చేశాడని చెప్పింది. ఆ తర్వాత అవినాష్ చేతుల మీదుగా కేక్ కట్టింగ్ చేసి అంతా కలిసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nIzAT6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...