Monday, 7 December 2020

మద్యం మత్తులో లేడీ డైరెక్టర్ హల్‌చల్... నడిరోడ్డుపై పోలీసులపైనే దాడికి యత్నం

తమిళనాడు సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ పీకలదాకా మద్యం తాగి నానా రచ్చ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో భాగంగా ఆమె కారును పోలీసులు సీజ్ చేయడంతో రెచ్చిపోయిన ఆ మహిళ హంగామా చేసింది. మత్తులో ఉండటంతో విచక్షణ మరిచి పోలీసులను బూతులు తిడుతూ రెచ్చిపోయింది. ఆదివారం రాత్రి చెన్నైలోని తిరువన్మియూర్‌లో ఈ ఘటన జరిగింది. చెన్నైకి చెందిన కామిని కోలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఆదివారం రాత్రి తన స్నేహితుడు శేషు ప్రసాద్‌తో కలిసి ఆమె కారులో వెళ్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపారు. డ్రైవింగ్ చేస్తున్న శేషు మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలడంతో కారును సీజ్ చేశారు. దీంతో మద్యం మత్తులో ఉన్న కామిని ఒక్కసారిగా రెచ్చిపోయి పోలీసుల దుర్భాషలాడింది. తాగితే తప్పేంటి.. అని ప్రశ్నిస్తూ వారిపై దాడికి యత్నించింది. శేషు ఆమెను వారించేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. Also Read: పోలీసులు ఆమెను శాంత పరిచేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు వాహనదారులు ఆ తతంగాన్నంతా వీడియో తీశారు. ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 294(బి)(బూతులు తిట్టడం), 323 (ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం), 353 (ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ లేడీ డైరెక్టర్‌ బాగోతం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33Q0As4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...