దగ్గుబాటి వారసుడు, స్టార్ హీరో గురించి ఫిదా బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన లేటెస్ట్ మూవీ ''పై స్పందిస్తూ రానా వ్యక్తిత్వం ఎలాంటిదనే దానిపై ఓపెన్ అయింది. 'విరాటపర్వం' సినిమా పోస్టర్‌పై రానాతో పాటు సాయి పల్లవి పేర్లు వేయడం వెనుక రీజన్ రానానే అని, ఆయన వల్లనే అది సాధ్యమైందని ఆమె చెప్పింది. 'విరాటపర్వం' సినిమాలో హీరోతో సమానమైన రోల్ చేశానని, అందుకే పోస్టర్‌పై హీరో రానా పేరుతో పాటు తన పేరు కూడా వేశారని సాయి పల్లవి చెప్పింది. కాకపోతే రానా గొప్ప మనసు కారణంగానే అది సాధ్యమైందంటూ ఓపెన్ అయింది. యదార్ధ ఘటనల ఆధారంగా నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న 'విరాటపర్వం' సినిమాలో రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. నేడు (డిసెంబర్ 14) రానా పుట్టినరోజు కానుకగా ఈ మూవీ నుంచి ఆయన లుక్ రిలీజ్ చేశారు. కామ్రేడ్ రవన్నగా రానా మీ ముందుకు రాబోతున్నారని తెలిపారు. Also Read: సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరిదశ షూటింగ్ జరుగుతోంది. చిత్రంలో ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mi0Mqi
v
No comments:
Post a Comment