Sunday, 13 December 2020

హైదరాబాద్‌లో రజినీకాంత్... ‘అన్నత్తే’ షూటింగ్ షురూ

ఓ వైపు రాజకీయ పార్టీ స్థాపనకు సన్నాహాలు చేస్తూనే.. మరోవైపు సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్‌. ఆయన హీరోగా శివ దర్శకత్వంలో ‘అన్నత్తే’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళంలో ‘అన్నత్తే’ అనే పదానికి తెలుగులో అన్నయ్య అని అర్థం. ఇందులో అన్నగా రజనీ సందడి చేస్తారని టైటిల్‌ చూస్తేనే తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం నుంచి రామోజీ ఫిల్మ్‌‌సిటీలో ప్రారంభం కానుంది. ఇందుకోసం రజినీ ఆదివారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సినిమాలో రజినీ సరసన నయనతార నటిస్తోంది. సుదీర్ఘంగా సాగే షెడ్యూల్‌లో పాల్గొనేందుకు నటీనటులు, యూనిట్ సభ్యులందరూ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇందులో కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా, ప్రకాష్‌రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qQYT7n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...