Thursday, 3 December 2020

‘పోకిరి’లో హీరోయిన్‌గా కంగనా.. కానీ ఇలియానాకు ఛాన్స్... అసలేం జరిగింది?

పూరి జగన్నాధ్‌, మహేష్‌బాబు కాంబినేషన్లో వచ్చిన ‘’ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2006, ఏప్రిల్‌ 28న విడుదలై ఈ చిత్రం అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ చెరిపేసింది. ఈ మహేష్‌కు జోడీగా గోవా బ్యూటీ ఇలియానా తన అందచందాలతో మెప్పించింది. శ్రుతి పాత్రలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. Also Read: అయితే ఈ పాత్ర కోసం ముందుగా ఇలియానా కాకుండా మరో హీరోయిన్‌ను అనుకున్నారట. ఆమె ఎవరో కావు బాలీవుడ్ ఫైర్ బ్రండ్ . ఈ సినిమా ఆడిషన్స్‌ ముంబయిలో జరుగుతున్న సమయంలో అక్కడే బాలీవుడ్ చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’ ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయట. ఇందులో పాల్గొనడానికి వచ్చిన కంగనా.. పనిలో పనిగా ‘పోకిరి’ ఆడిషన్స్‌లో కూడా పాల్గొన్నదట. అయితే కంగనా అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ రెండు సినిమాల్లోనూ ఒకేసారి అవకాశం వచ్చిందట. దీంతో రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి రావడంతో కంగనా బాలీవుడ్‌ సినిమాకే మొగ్గు చూపించిందట. దీంతో ఈ ఛాన్స్ ఇలియానాకు దక్కింది. బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కంగనా.. పూరీ, ప్రభాస్ కాంబినేషన్లో ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lFHOJG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...