Tuesday, 29 December 2020

అభిజీత్‌కు క్రేజీ ఆఫర్.. కామెడీ చేయడానికి రెడీ అవుతోన్న బిగ్ బాస్ విన్నర్!!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత సినీ నటుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా అభిజీత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తరవాత రెండు మూడు సినిమాలు చేసినా వాటి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. చాలా కాలం పాటు వెండితెరకు దూరమైన అభిజీత్.. కరోనా సమయంలో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బిగ్ బాస్ షో ద్వారా మరోసారి కనిపించారు. అంతేకాదు, ఈ షోలో స్టార్ కంటెస్టెంట్‌గా నిలబడి టైటిల్‌ను గెలుచుకున్నారు. ప్రస్తుతం అభిజీత్ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. అలాగే, తనకు సపోర్ట్ చేసిన విజయ్ దేవరకొండ లాంటి స్నేహితులను కలిసి వారికి కృత‌జ్ఞత‌లు తెలుపుతున్నారు. అయితే, రాబోయే రోజుల్లో సినిమా షూటింగ్‌తో బిజీ కాబోతున్నారట అభిజీత్. ఆయన సినిమా అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అది కూడా ‘’ లాంటి క్రేజీ మల్టీస్టారర్‌లో అని టాక్. బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేలో దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఫైనలిస్ట్‌లు అభిజీత్, అఖిల్, సోహెల్ మేనరిజంలను చేసి చూపించి అందరినీ నవ్వించారు అనిల్. ఈ షోలో అభిజీత్‌ను స్వయంగా కలిసిన అనిల్ రావిపూడి ఆయనకు ఆఫర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ‘F3’లో ఒక కీలక పాత్రకు అభిజీత్‌ను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. బ్లాక్ బస్టర్ మూవీ ‘F2’కి సీక్వెల్‌గా వస్తోన్న ‘F3’లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nX0tmh
v

No comments:

Post a Comment