తెలుగు తెరపై గ్లామర్ బ్యూటీగా, క్రేజీ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హరితేజ. బుల్లితెర, వెండితెర ప్రయాణం సాఫీగా సాగిస్తూనే బిగ్ బాస్ ప్రోగ్రాంలో పాల్గొని ఫుల్ పాపులారిటీ సంపాదించింది. బిగ్ బాస్ తర్వాత పలు క్రేజీ ఆఫర్స్ అందుకున్న ఆమె తాజాగా ఓ శుభవార్త చెబుతూ వీడియో వదిలింది. తాను త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానని తెలుపుతూ బేబీ బంప్ షో చేసింది. తన సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేసిన .. ఈ వీడియోలో తన బేబి బంప్‌ని చూసి మురిసిపోతూ స్టెప్పులేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హరితేజను ప్రగ్నెంట్‌గా చూసిన ఆమె అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Also Read: స్టార్ మా, జెమినీ, ఈటీవీ లాంటి ఛానల్స్‌లో యాంకర్‌గా సందడి చేసిన హరితేజ.. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో విభిన్నమైన పాత్రలతో పలు సినిమాల్లో ఆకట్టుకుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అఆ' సినిమాలో సమంతకు అసిస్టెంట్‌గా పని చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. నాలుగేళ్ల క్రితం దీపక్ రావు అనే వ్యక్తిని వివాహం చేసుకున్న హరితేజ.. మాతృత్వాన్ని తనివితీరా ఆస్వాదించేందుకు ఎంతో ఆతృతగా ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JOAKgX
v
No comments:
Post a Comment