ప్రియుడు మైకేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన కొన్ని రోజులపాటు సినిమాలకు దూరంగా ఉండి తిరిగి ఇటీవలే కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అతనితో బ్రేకప్ చేసుకున్న ఈ బ్యూటీ.. వరుస పెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మళ్ళీ పాతరోజుల్లా బిజీ హీరోయిన్ కావాలని చూస్తోంది. ఈ మేరకు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్, దానిపై ట్యాగ్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్మాత, రచయిత ర్యాన్ ఇవాన్ స్టీఫెన్ లుంగీ దొంగిలించి.. ఆ లుంగీతో ఫోటోలకు ఫోజిచ్చింది శృతి హాసన్. నీళ్లలో దిగి హాఫ్ బికినీలో అలా ఎంజాయ్ చేస్తున్న ఆమె.. స్వయంగా ఈ లుక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ లుంగీ స్టీఫెన్‌ది అని చెబుతూ ఆయనకు సారీ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ జత చేసింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎక్కువగా నలుపు దుస్తుల్లోనే కనిపించే శృతి.. ఈ ఫోటోపై 'కొన్ని సెలవులు ఇలా రంగులతో ఎంజాయ్ చేస్తా' అని పేర్కొంది. Also Read: ప్రస్తుతం రవితేజ సరసన '' మూవీలో నటిస్తోంది శృతి హాసన్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. లాస్ట్ సాంగ్ షూటింగ్ నిమిత్తం ఈ రోజే గోవా వెళ్లింది చిత్రయూనిట్. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g5Hdjl
v
No comments:
Post a Comment