Friday, 25 December 2020

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తీవ్ర అస్వస్థత.. అపోలో హాస్పిటల్‌లో చేరిక

సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన తమిళ సూపర్ స్టార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో బాధపడుతున్న రజినీ.. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. అన్నాత్తే సినిమా షూటింగ్ సమయంలో ఆరుగురికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో షూటింగ్‌కు బ్రేకులేశారు. తర్వాత ఆయన నగరంలోనే హోం క్వారంటైన్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం బీపీ పెరగడంతో రజినీని అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. డిసెంబర్ 22న రజినీకి కరోనా టెస్టులు చేయగా నెగటివ్ అని తేలిందని అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. రజినీకి హైబీపీ మినహా ఇతర ఆరోగ్య సమస్యలేవి లేవని హాస్పిటల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. కాగా రజినీకి కరోనా పాజిటివ్ అని తాజాగా తేలినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కోవిడ్ లక్షణాలు కనిపించడంతోనే ఆయన హాస్పిటల్‌లో చేరారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇదంతా అవాస్తమని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రజినీకాంత్ తమిళనాట కొత్త రాజకీయ పార్టీ ప్రకటన దిశగా చురుగ్గా అడుగులేస్తున్నారు. జనవరిలో కొత్త పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించేందుకు ప్రణాళికలు రూపొందించారు. డిసెంబర్ 12న రజినీ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. పార్టీ పనుల కోసం ఆరోజు ఢిల్లీలో ఉన్న రజినీ కాంత్.. మరుసటి రోజు చెన్నై నుంచి హైదరాబాద్ ప్రత్యేక విమానంలో వస్తుండగా.. ఫ్లయిట్‌లోనే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రజినీ కుమార్తె ఐశ్వర్య ధనుష్, హీరోయిన్ నయనతారతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38sqeUY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...