Wednesday, 9 December 2020

అక్టోబర్‌లో పెళ్లి.. డిసెంబర్‌లో సూసైడ్.. నటి చిత్ర సూసైడ్ కేసులో సంచలన విషయాలు

బుల్లితెర నటి వి.జె.చిత్ర(28) ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. చెన్నైలోని తిరువాణ్మియూర్‌లో నివాసముండే చిత్ర అనేక టీవీ సీరియళ్లతో పాటు పలు సినిమాల్లోనూ నటించింది. ఆగస్టు నెలలో ఆమెకు వ్యాపారవేత్త హేమంత్ రవితో నిశ్చితార్థం జరిగింది. అక్టోబర్ 19న వీరిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే పెద్దల సమక్షంలో జనవరిలో మళ్లీ పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. Also Read: ఈ క్రమంలోనే బెంగళూరు- పూందమల్లి హైరోడ్డులోని ఈవీపీ ఫిలింసిటీలో ‘పాండియన్‌ స్టోర్స్’ షూటింగ్‌ కోసం చిత్ర ఈ నెల 4వ తేదీ హేమంత్‌తో కలిసి వచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరు నజరత్‌పెట్టై‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున షూటింగ్ ముగించుకుని వచ్చిన చిత్ర స్నానం చేసి వస్తానని చెప్పి గదిలోకి వెళ్లి ఎంతసేపటికి రాలేదు. దీంతో హేమంత్ హోటల్‌ సిబ్బంది సాయంతో గది తలుపు తెరిచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది సమాచారం అందుకున్న నజరత్‌పేట్టై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిత్ర మృతిపై అనుమానం ఉందని ఆమె తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లయిన రెండు నెలలకే చిత్ర ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంపతుల మధ్య ఏవైనా గొడవలు జరుగుతున్నాయా? లేక వేరే కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణంతో ఆర్డీవో విచారణ చేపట్టారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n7TUNA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...