Sunday, 13 December 2020

ముంబయి వెళ్లిపోయిన ఆలియా.. ‘ఆర్ఆర్ఆర్’కు చిన్న బ్రేక్

దర్శక ధీరుడు ఎస్.ఎస్. దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘: రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ‘సీత’ పాత్రలో నటిస్తోంది. వారం రోజుల క్రితం షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన ఆలియా చిన్న బ్రేక్ తీసుకుందట. యూనిట్‌తో చాలా ఆలస్యంగా జాయిన్ అయిన ఆలియా వచ్చిన వారం రోజులకే మళ్లీ బ్రేక్ తీసుకోవడంతో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌‌ ఆగిపోయింది. ఆమె ఈ నెల 18న తిరిగి రానున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ జరిగిన షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ల మీద సన్నివేశాలేవీ తెరకెక్కించలేదు. చెల్లెలు నిహారిక పెళ్లి కోసం రామ్‌చరణ్‌ ఉదయ్‌పూర్‌ వెళ్లడంతో ఆలియాపై మాత్రమే సన్నివేశాలను చిత్రీకరించారు. రామ్‌చరణ్ షూటింగ్‌కు సిద్ధమైన సమయంలో ఆలియా ముంబయి వెళ్లిపోవడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. భీమ్‌ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్‌ నటిస్తున్నారు. డి.వి.వి. దానయ్య సుమారు రూ.450కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37VnRde
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...