పవర్ స్టార్ రాజకీయాలతో పాటు వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిన సంగతి తెలిసిందే. రీఎంట్రీలో భాగంగా ఆయన ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత క్రిష్‌తో పాటు మరో రెండు మూడు సినిమాలను ఆయన లైన్లో పెట్టారు. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్‌తోనూ పవన్ కలిసి పనిచేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. Also Read: గతంలో , పవన్ కాంబినేషన్లో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు.. సినిమాలు తెరకెక్కాయి. వరుస పరాజయాల తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’తో ఫామ్‌లోకి వచ్చిన పూరీ.. మహేశ్‌బాబుతో ‘జనగణమన’ అనే సినిమాను తెరకెక్కించేందుకు కథ సిద్ధం చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల అది సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇప్పుడు అదే కథను పవన్‌తో తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. కరెప్షన్ నేపథ్యంలో సాగే ఈ కథలో మంచి దేశభక్తి ఎలిమెంట్స్ ఉంటాయట. Also Read: ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో పవన్ ఈ సినిమా చేస్తే బాగుంటుందని పూరీ ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ చేతిలో చాలా సినిమాలు ఉండటంతో పూరీ జగన్నాథ్‌కు ఓకే చెబుతారా? లేదా? అన్నది చూడాలి. ఒకవేళ ఓకే చెప్పినా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలంటే 2022 వరకు ఆగాల్సిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n278eq
v
No comments:
Post a Comment