Sunday, 6 December 2020

మిస్డ్ కాల్ ఇవ్వండి.. డౌన్‌లోడ్ చేసుకోండి.. డర్టీ హరి మూవీపై కీలక ప్రకటన చేసిన ఎం.ఎస్. రాజు

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందించిన రొమాంటిక్ మూవీ 'డ‌ర్టీ హ‌రి' విడుదల తేదీ ఫిక్స్ చేశారు మేకర్స్. కొందరు సినీ ప్రముఖులు కలిసి ఏటీటీ (ATT) యాప్‌ని లాంఛ్ చేయబోతున్నారు. ఇందులో తొలి సినిమాగా అడల్ట్ కంటెంట్ మూవీ 'డ‌ర్టీ హ‌రీ'ని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 18న ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. పే ఫర్ వ్యూ పద్దతిలో నడిచే ఈ కొత్త ఏటీటీ మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తోంది మేనేజ్‌మెంట్. ఈ సందర్బంగా చిత్ర సమర్పకులు గూడూరు శివరామకృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా ట్రైలర్‌కి ఊహించిన దానికిమించిన రెస్పాన్స్ వచ్చింది. అలాగే మేము విడుదల చేసిన ఫుల్ వీడియో సాంగ్ కోటి వ్యూస్‌కి అతి సమీపంలో ఉంది. ఈ ట్రైలర్, ఈ సాంగ్‌తో అటు ప్రేక్షకులలోను, ఇటు పరిశ్రమలోను అనూహ్యమైన బజ్ వచ్చింది. దేవి, వర్షం, ఒక్కడు , మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బాస్టర్స్ నిర్మించిన ఎం.ఎస్.రాజు దర్శకునిగా ఒక కొత్త పంధాలో ఈ సినిమని తీర్చిదిద్దారు. ఫస్ట్ కాపీ చూసిన 'హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్' సంస్థ అధినేతలు కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి ఫ్యాన్సీ రేటుతో ఈ సినిమా కొనుగోలు చేసారు. 'ఫ్రైడే మూవీస్' యాప్ ఈ సినిమాతోనే ప్రారంభం కానుంది. ఈ యాప్‌లో కొంతమంది ప్రముఖులు ఇన్‌వాల్వ్ అయి ఉన్నారు. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి 7997666666 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది" అన్నారు. Also Read: దర్శకుడు మాట్లాడుతూ.. "నేను నిర్మాతగా చాలా జానర్‌లలో సినిమాలు తీశాను. దర్శకునిగా ఓ కొత్త జానర్ ప్రయత్నిద్దామని '' రూపొందించాను. ఈ విషయంలో నాకు మంచి స్నేహితులైన గూడూరు శివరామకృష్ణ అండగా నిలబడ్డారు. ఎం.ఎస్.రాజు ఏంటి? ఇలాంటి సెక్స్ సినిమా తీసాడేంటని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేయడం చూసాను. దాని గురించి ఇప్పుడేం మాట్లాడను. నేనెందుకీ సినిమా తీసాను ? ఇలా ఎందుకు తీసాను ? అనేది ఈ నెల 18న సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమా మేకింగ్‌ని పర్సనల్‌గా ఎంజాయ్ చేస్తూ తీసాను. నా కెరీర్ లోనే గొప్ప స్క్రీన్ ప్లే సినిమాగా నిలిచిపోతుంది. ముగ్గురి మధ్యన జరిగే డ్రామా చాలా కొత్తగా ఉంటుంది. హీరో శ్రవణ్ రెడ్డి స్క్రీన్ మీద మేజిక్ చేసాడు. సిమ్రత్ కౌర్ తన పాత్రలో జీవించింది. రుహాని శర్మ పాత్రకి మంచి మార్కులు పడతాయి. ఖర్చుకి వెనుకాడకుండా ఈ సినిమా తీసిన నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ లను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను" అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37E36me
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...