Monday, 7 December 2020

బాలీవుడ్‌లో కరోనా కలకలం... కృతి స‌నన్‌కు పాజిటివ్‌

దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య తగ్గినట్లుగా కనిపించినా సామాన్య ప్రజలతో పాటు సెలబ్రెటీలు ఆ మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. నుంచి టాలీవుడ్‌ వరకు చాలామంది సెలబ్రెటీలు దీని బారిన పడి కోలుకున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె నిర్ధారించకపోయినా కృతికి కరోనా సోకిన వార్త బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. కృతిసనన్ ప్రస్తుతం రాజ్‌కుమార్ రావ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ఛండీగఢ్‌‌లో జరిగింది. అక్కడి నుంచి ఢిల్లీకి వస్తూ విమానంలో దిగిన ఫోటోను కృతి సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత ఆమె మళ్లీ సోషల్‌మీడియాలో కనిపించలేదు. కరోనా సోకడంతో కృతి సనన్‌ బయట కనిపించడం లేదని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. Also Read: తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాతో మెప్పించిన ... ఆ తర్వాత నాగచైతన్య సరసన ‘దోచెయ్’లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆశించిన విజయం సాధించలేకపోవడంతో ఇక్కడ అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’లో ఆమెకు అవకాశం వచ్చినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీనిపై యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mYZv8A
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...