Thursday, 10 December 2020

‘సర్కారు వారి పాట’ కథలో మార్పులు.. మాఫియా డాన్‌గా మహేశ్‌!

సూపర్‌స్టార్ , పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘’ సినిమా ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లినా కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ గ్యాప్‌లో దర్శకుడు పరశురామ్‌ కథలో అనేక మార్పులు చేశాడట. ఈ కథ మహేశ్‌కు తొలుత వినిపించినప్పుడు రివేంజ్ స్టోరీ‌గా ఉందట. తన తల్లిని మోసం చేసిన ఓ వైట్ కాలన్ నేరస్థుడిపై పగ తీర్చుకునేందుకు హీరో ప్రయత్నాలే ఈ కథ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ కథ రొటీన్‌గా ఉందని భావించిన పరశురామ్.. ఖాళీ టైమ్‌లో దాన్ని మరిన్ని హంగులు అద్దాడట. దీంతో యాక్షన్ కమ్ మాఫియా టచ్ ఇచ్చి కథను మార్చేసినట్లు తెలుస్తోంది. హీరో అమెరికాకు వెళ్లడం, అక్కడ ఓ ట్విస్ట్ చోటుచేసుకోవడం, వైట్ కాలర్ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో తాను మాఫియా డాన్‌గా మారడం.. ఇలాంటి మలుపులతో కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పరశురామ్ తాజాగా చేసిన మార్పుల వల్ల కథ మరింత బలంగా మారిందని, దీనిపై మహేష్‌ కూడా సంతృప్తిగా వ్యక్తం చేసినట్లు సమాచారం, ఈ సినిమా షూటింగ్ జనవరిలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. సగం పార్ట్ ఇక్కడే షూటింగ్ జరుపుకున్న తర్వాత యూనిట్ అమెరికా వెళ్తుందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KfcG6Q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...