Wednesday, 23 December 2020

రష్మిక మందన బాలీవుడ్‌ ఎంట్రీ కన్ఫర్మ్.. యంగ్ హీరోతో రొమాన్స్‌కి రెడీ అయిన కన్నడ బ్యూటీ

'ఛలో' అంటూ టాలీవుడ్ గడపతొక్కిన కన్నడ భామ .. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ కొట్టేసింది. వరుస సక్సెస్‌లతో సత్తా చాటుతున్న ఈ భామ.. ఈ ఏడాది ''సరిలేరు నీకెవ్వరు, భీష్మ'' రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకొని సూపర్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు బాలీవుడ్ నుంచి సూపర్ ఆఫర్ వచ్చింది. యంగ్ హీరో న‌టిస్తోన్న '' సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ పట్టేసింది ర‌ష్మిక. 1970వ దశకంలో జరిగిన కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో `రా` ఏజెంట్‌గా సిద్ధార్థ్ నటిస్తున్నాడు. యాడ్ ఫిల్మ్ మేకర్ షంతాను బాచి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు రానుంది. ఈ సినిమా కంటే ముందే షాహిద్ క‌పూర్ నటించిన‌ జెర్సీ హిందీ రీమేక్‌లో కూడా ర‌ష్మిక‌కు ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆ ప్రాజెక్ట్‌కు నో చెప్పింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో నటిస్తోంది రష్మిక మందన. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పల్లెటూరు పిల్లలా రష్మిక స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనుంది. అలాగే ఇటీవలే శర్వానంద్ హీరోగా రూపొందబోతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాకు కూడా సంతకం చేసింది ఈ ముద్దుగుమ్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ri4Qut
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...