యంగ్ హీరో ఎంతో ప్రతిభావంతుడని, ప్రతి సినిమాలోనూ అమోఘమైన నటన కనబర్చుడతాడని ప్రశంసించాడు బిగ్‌బాస్-4 విజేత . బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన అభిజిత్.. విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ నా వాడు, నా స్నేహితుడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయ్, తాను తరచు మాట్లాడుకుంటామని తెలిపాడు. Also Read: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో తాను, విజయ్ కలిసి నటించామని అభిజిత్ గుర్తు చేసుకున్నాడు. ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ప్రతిభావంతులేనని, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ వారి సొంత గ్రాఫ్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో అభిజిత్ హీరోగా నటించగా.. విజయ్ దేవరకొండ నెగెటివ్ ఛాయలుండే చిన్న పాత్రలో మెరిశాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. అభిజిత్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు అతడికి మద్దతుగా విజయ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mKEyNG
v
No comments:
Post a Comment