Wednesday, 23 December 2020

'ఆచార్య' సెట్‌లో చిరంజీవిని కలిసిన మోహ‌న్‌బాబు.. మెగాస్టార్ గ్రాండ్ వెల్‌కమ్

మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త సమర్పణలో ఎస్. నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ బాణీలు కడుతున్నారు. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉండనుందని టాక్. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని కోకాపేటలో వేసిన భారీ సెట్లో 'ఆచార్య' షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌పై మెగాస్టార్ చిరంజీవిని క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు క‌లుసుకున్నారు. ఆ ఇద్ద‌రూ చిర‌కాల మిత్రుల‌నే విష‌యం తెలిసిందే. చిరంజీవికి బొకే ఇచ్చి, స్నేహ‌పూర్వ‌కంగా క‌లిశారు మోహన్ బాబు. చిర‌కాల మిత్రుడు త‌న సినిమా సెట్స్‌కు రావ‌డంతో చిరంజీవి ఆనందంతో మోహ‌న్‌బాబును ఆహ్వానించారు. ఆ ఇద్ద‌రూ కొద్దిసేపు సినిమాల‌తో పాటు వివిధ అంశాల‌పై మాట్లాడుకున్నారు. నిన్న (మంగళవారం) చిరంజీవిని మంచు విష్ణు కలవడం, నేడు మోహన్ బాబు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోహ‌న్‌బాబు ప్ర‌స్తుతం 'స‌న్ ఆఫ్ ఇండియా' మూవీ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇందులో మోహన్ బాబు పవర్‌ఫుల్ రోల్‌లో నటించనున్నారని, గతంలో ఎన్నడూ చూడని పాత్ర చేస్తున్నారని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WCGKMK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...