Friday, 25 December 2020

అభిమానికి సర్‌ప్రైజ్... ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లో సందడి చేసిన సోనూసూద్

లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న బహుభాషా నటుడు సోనుసూద్‌ శుక్రవారం తన అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌ నగరంలోని ఓ అభిమాని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో సడెన్‌గా ప్రత్యక్షమై అతడిని ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తారు. హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన తార్కంపేట అనిల్‌కుమార్‌.. ప్రకాశ్‌నగర్‌లో కొంతకాలంగా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. సోనుసూద్‌ స్ఫూర్తితో ఇటీవల తన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ పేరును ‘లక్ష్మీ సోనుసూద్‌’గా మార్చి ఆయన ఫొటోను పెట్టుకున్నాడు. అక్కడికి వచ్చే వినియోగదారులు సోనుసూద్‌ ఫొటోతో సెల్ఫీలు దిగి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. కొందరు ఈ పోస్టులను సోనూసూద్‌ అకౌంట్‌కి ట్యాగ్ చేయడంతో విషయం ఆయనకు తెలిసింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వచ్చి అనిల్‌కుమార్‌ ఆలింగనం చేసుకున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి వెళ్లి స్వయంగా గరిట తిప్పి అక్కడున్న వారిని తింటారా అని పలకరించారు. అనిల్‌ తయారుచేసిన ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌ రుచి చూసి చాలా బాగుందని మెచ్చకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బందులు పడ్డ యువతకు స్ఫూర్తి కలిగించాడంటూ అంటూ అనిల్‌ను సోనుసూద్‌ ప్రశంసలతో ముంచెత్తారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WKo9yj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...