Sunday, 27 December 2020

పెళ్లి కూతురైన 'వదినమ్మ' ఫేమ్ ప్రియాంక నాయుడు.. హల్దీ ఫంక్షన్‌లో నటి ఎమోషనల్!

2020 సంవత్సరం మొత్తం సెలబ్రిటీల పెళ్లి సంగతులే వినిపించాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా వరుసపెట్టి పెళ్లి పీటలెక్కారు. పలువురు నటీనటులు తాము ఎంతగానో ఇష్టపడిన వ్యక్తిని కుటుంబ సమక్షంలో పెళ్లాడారు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయింది 'వదినమ్మ' ఫేమ్ . ఆమె మరో సీరియల్ ఆర్టిస్ట్ మధుబాబును పెళ్లాడబోతోంది. గత కొన్నినెలల క్రితమే తాము పెళ్లిచేసుకోబోతున్న స్వయంగా మధుబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలాకాలం పాటు ప్రేమలో మునిగితేలిన ప్రియాంక నాయుడు- మధుబాబు తాజాగా నవ వధూవరులుగా ముస్తాబయ్యారు. తాను పెళ్లికూతురు అయ్యాయని ప్రకటిస్తూ హల్దీ ఫంక్షన్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక. కాగా ఈ ఫంక్షన్‌లో ఆమె కాస్త ఎమోషనల్ అవుతూ కనిపించడం విశేషం. దీంతో హల్దీ, మెహెందీ ఈవెంట్లలో ప్రియాంక నాయుడు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రియాంక నాయుడు- మధుబాబు కొంతకాలంగా ప్రేమించుకుంటూ పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవలే మదర్స్ డే సందర్భంగా మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చిందని తెలుపుతూ తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు మధుబాబు. దీంతో అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ చెబుతూ ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ షేర్ చేసింది ప్రియాంక. అభిషేకం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన మధుబాబు.. మంగమ్మగారి మనవడు సీరియల్‌తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రియాంక నాయుడు విషయానికి వస్తే.. వదినమ్మ సీరియల్‌లో 'సిరి' క్యారెక్టర్‌తో తెలుగు బుల్లితెరకు బాగా దగ్గరైంది. ఈ క్యారెక్టర్‌లో తెలంగాణ యాసలో అదరగొడుతూ ఫేమస్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KYNu4S
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...