Monday, 21 December 2020

Bigg Boss 4 Telugu: సోహెల్‌కి బ్రహ్మానందం సూపర్ ఆఫర్.. ఇక మనోడి దశ తిరిగినట్లే..!

గత సీజన్లతో పోల్చితే సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుందని తెలుస్తోంది. రేటింగ్స్ పరంగా మొదట్లో కాస్త తడబడినా ఆ తర్వాత పుంజుకొని గ్రాండ్ ఫినాలే వరకు వచ్చేసరికి భారీ క్రేజ్ కూడగట్టుకుంది బిగ్ బాస్. ఓటింగ్ పరంగా కూడా గత సీజన్ల కంటే ఎక్కువ ఓటింగ్ తెచ్చుకుంది. ఈ సారి విజేతగా నిలిచిన అభిజిత్‌తో పాటు ఫైనల్ వరకూ వచ్చిన ఐదుగురు కంటిస్టెంట్స్ ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సోహెల్ బాగా హైలైట్ అయ్యాడు. గ్రాండ్ ఫినాలేలో సోహెల్‌కి మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రామిస్ చేయడం హైలైట్ కాగా.. తాజాగా హాస్య బ్రహ్మ సైతం అతని విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. హౌస్ నుంచి బయటకొచ్చిన సోహెల్‌కి అండగా కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా రంగంలోకి దిగబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అదేనండీ.. తాను ఓ సినిమా చేయాలనుకుంటున్నానని, దానికి మీ సపోర్ట్ కావాలని మెగాస్టార్‌ని సోహెల్ అభ్యర్థించగా.. ఏకంగా నీ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తా అని అతనికి చిరంజీవి మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో బ్రహ్మానందం కూడా సోహెల్ సినిమా కోసం ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. సోహెల్ చేయబోయే సినిమాలో నటించేందుకు బ్రహ్మానందం సిద్దమయ్యారట. అది కూడా ఎలాంటి రెమ్మ్యూనరేషన్ లేకుండా. ప్రస్తుతం ఈ విషయం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఎన్నో సినిమాలను కేవలం తన కామెడీ తోనే ఒంటిచేత్తో విజయం అందించిన ఘనత బ్రహ్మానందం సొంతం. అయితే ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా సినిమాలు చేస్తున్న ఆయన.. సోహెల్ కోసం రంగంలోకి దిగడమంటే మామూలు విషయం కాదు. పైగా ఇదే మూవీకి చిరంజీవి సపోర్ట్ కూడా ఉండబోతోంది. ఇదే గనక జరిగితే ఇక సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్ దశ తిరిగినట్లే మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37BDibA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...