Monday, 7 December 2020

Anushka Sharma: బాబోయ్.. విరుష్క జోడీ ఈ రేంజ్‌లో సంపాదిస్తున్నారా? ఇండియాలోనే మోస్ట్ రిచెస్ట్ కపుల్

టీమ్ ఇండియా కెప్టెన్ , ఎంటర్‌టైన్‌మెంట్ క్వీన్‌ టాప్ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలు మాత్రమే కాదండోయ్.. సంపాదనలో కూడా ఈ జోడీని మించిన సెలబ్రిటీ కపుల్ మరొకటి లేదు. వరల్డ్ క్లాస్ క్రికెటర్‌గా సత్తా చాటుతూ పరుగుల రారాజు అనిపించుకుంటున్న విరాట్ కోహ్లీ.. సంపాదన విషయం లోనూ రారాజే అని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం విరుష్క దంపతుల ఆస్తి విలువ సుమారు 1200 కోట్లు అని తెలుస్తుండటం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ- టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. 2013 సంవత్సరంలో ఓ షాంపూ అడ్వర్టైజ్‌మెంట్ షూట్ కోసం కలిసిన ఈ జంట.. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగితేలి 2017 సంవత్సరంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కూడా ఎవరి ప్రొఫెషన్ వారు కొనసాగిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ సమాచారం మేరకు ఈ జోడీ ఇండియా మోస్ట్ రిచెస్ట్ సెలబ్రిటీ కపుల్‌గా అవతరించిందని అంటున్నారు. 2019 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం విరాట్ కోహ్లీ నెట్‌వర్త్ సుమారు 252.72 కోట్లుగా ఉంది. అంతేకాదు టాప్-100 సెలెబ్రెటీస్‌లో ఒకరుగా ఉన్నారు. అదేవిధంగా ఆయనకు ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయం, ఇతర పెట్టుబడులు అన్నీ లెక్కేసుకుంటే సుమారు 900 కోట్లు ఉంటుందని కొందరు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరోవైపు అదే ఫోర్బ్స్ లెక్కల ప్రకారం 2019కి గాను అనుష్క శర్మ ఆదాయం 28.67 కోట్లు. ఆమె మొత్తం ఆదాయ విలువ చూస్తే 350 కోట్లు అని తెలుస్తోంది. కాగా, ప్రధానంగా వీరిద్దరి ఆదాయం ప్రకటనల ద్వారానే వస్తోందని సమాచారం. Also Read: వీరిద్దరికీ ముంబైలో రెండు ఖరీదైన రెస్టారెంట్లు, 50 కోట్ల విలువ గల ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్, అలాగే గూర్గాన్‌లో 80 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తెలిసింది. దీంతో ఈ లెక్కలు చూసి షాకవుతున్నారు జనం. ఇదిలాఉంటే ప్రస్తుతం గర్భవతిగా ఉన్న అనుష్క.. జనవరిలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇటీవలే ఈ విషయాన్ని స్వయంగా తెలిపి తమ తమ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు విరుష్క దంపతులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Le5Oay
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...