ఎంత జోష్‌లో ఉంటే మాత్రం లాంటి స్టార్ హీరో సినిమాలో నటించడానికి 'నో' చెప్పడమేంటి? సినిమా అన్నాక ఒక్కో క్యారెక్టర్ ఒక్కోలా ఉంటుంది.. అవసరాన్ని బట్టి వేషం మార్చాల్సిందే గానీ ఇలా కుదరదంటే ఎలా? ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఇదే చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న '' సినిమాలో తన వేషం నచ్చలేదని అనసూయ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో జనాల్లో ఈ చర్చ ముదిరింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తున్న వార్తలను బట్టి చూస్తే.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప' సినిమాలో నటించేందుకు గాను అనసూయ సింపుల్‌గా 'నో' చెప్పిందని తెలుస్తోంది. ఇక అందుకు కారణం ఈ మూవీలో ఆమె చేయబోయే క్యారెక్టర్ మేకప్ లేకుండానే డీ గ్లామరస్ రోల్ అని డైరెక్టర్ సుకుమార్ చెప్పడమేనట. ఇది మూవీలో కీలక పాత్ర అయినప్పటికీ మేకప్ లేకుండా నటించడం తన వల్ల కాదని తెగేసి చెప్పిందట ఈ జబర్దస్త్ యాంకర్. Also Read: బుల్లితెర సంగతి అటుంచితే.. వెండితెరపై అనసూయకు తిరుగులేని గుర్తింపు ఇచ్చింది సుకుమారే. 'రంగస్థలం'లో రంగమ్మత్త క్యారెక్టర్ ఇచ్చి ఆమె సిల్వర్ స్క్రీన్ కెరీర్ టర్న్ చేసేశారు. మరి అలాంటి డైరెక్టర్‌కే అనసూయ నో చెప్పడమేంటనేది జనాల్లో అనుమానం. సో.. 'పుష్ప' మూవీ విషయమై వస్తున్న ఈ వార్తల్లో నిజమెంత అనేది అనసూయ గానీ, సుకుమార్ గానీ స్పందిస్తేనే తెలుస్తుంది మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37GMCto
v
No comments:
Post a Comment