కన్నడ దివంగత హీరో కుటుంబం కరోనా బారిన పడింది. తాను, బాబు, అమ్మానాన్నలు కరోనా బారిన పడినట్లు చిరంజీవి భార్య, నటి సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ‘హలో.. మా అమ్మా నాన్న, నాకు, నా కుమారుడికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కొన్ని వారాలుగా మమ్మల్ని కలిసిన వారు కూడా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరుతున్నాం.. ప్రస్తుతం మేం చికిత్స పొందుతున్నాం.. చిరు అభిమానులకు ఓ విజ్ఞప్తి.. జూనియర్ చిరు ఆరోగ్యంగానే ఉన్నాడు. నేనెప్పుడూ తనతోనే ఉంటున్నా’ అంటూ మేఘనారాజ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. దయచేసి ఎవరూ ఆందోళన చెందొద్దు.. మహమ్మారిపై యుద్ధంలో మా కుటుంబం గెలుస్తుంది. వైరస్‌ను జయిస్తాం’’ అని మేఘన పేర్కొన్నారు. దక్షిణాదిలో సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడైన చిరంజీవి సర్జా అనేక సినిమాల్లో హీరోగా నటించారు. గతేడాది జూన్ 7వ తేదీన గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే చిరు భార్య మేఘనారాజ్ గర్భవతిగా ఉన్నారు. భర్త కటౌట్ పెట్టుకుని సీమంతం చేసుకున్న ఫోటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. అక్టోబర్ నెలలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lQ0C9q
v
No comments:
Post a Comment