Sunday, 1 November 2020

Trivikram Srinivas: రామ్‌తో త్రివిక్రమ్ మూవీ.. బాబోయ్! ఈ రేంజ్‌లో డీల్ కుదిరిందా..?

ఈ ఏడాది ఆరంభంలోనే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఆల్ టైమ్ హిట్ ఖాతాలో వేసుకున్న మాటల మాంత్రికుడు తదుపరి సినిమా గురించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఆయన తదుపరి సినిమా ఉండనుందని తెలిసినప్పటికీ RRR ఆలస్యమవుతుండటంతో ఆ లోగా ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో మూవీ ఫినిష్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు టాక్. తాజాగా ఈ కాంబోపై వస్తున్న సినిమా కోసం భారీ రేంజ్‌లో డీల్ కుదిరిందని తెలుస్తోంది. సాధారణంగా అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలతోనే యమ బిజీగా ఉండే త్రివిక్రమ్.. హీరో రామ్ రిక్వెస్ట్ మేరకు ఓ కథ సిద్ధం చేశారని సమాచారం. జులాయి మూవీ టైప్‌లో కథ కావాలని రామ్ కోరారట. అయితే ఈ కథ కోసం త్రివిక్రమ్ ఏకంగా 10 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించడం సందేహమే గానీ స్క్రీన్ ప్లే మాత్రం ఆయనే అందిస్తారని తెలిసింది. మొత్తంగా చూస్తే ఈ మూవీ నిర్మాణం కోసం 45 కోట్లు అవసరమవుతాయనే విషయం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. Also Read: ఒకానొక సమయంలో వరుస ప్లాపులతో సతమతమైన హీరో ‘ఇస్మార్ట్ శంకర్‌’‌తో తిరిగి ట్రాక్ ఎక్కాడు. అదే ఎనర్జీతో ఇటీవలే 'రెడ్' సినిమా పూర్తి చేశాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఏ సినిమా ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్- రామ్ కాంబోలో సినిమా అనేసరికి యూత్ ఆడియన్స్‌ యమ అట్రాక్ట్ అవుతున్నారు. ఈ మూవీ అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందా? అనే కుతూహలం అందరిలోనూ కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/325nt9Y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...