Monday, 23 November 2020

మహిళల ఇమేజ్‌ని పెంచే ‘Tempt రాజ’.. ఎట్టెట్టా, టీజర్ చూస్తే అలా లేదే!!

సే క్రియేషన్స్ బ్యానర్‌పై ఏఆర్‌కే ఆర్ట్స్ సమర్పణలో వస్తోన్న సినిమా ‘Tempt రాజ’. అడల్ట్ కామెడీతో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఓ వర్గాన్ని ఆటకట్టుకుంటే మరో వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ విడుదల సందర్భంగా చిత్ర హీరో, నిర్మాత రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ.. ‘‘Tempt రాజా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అడల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా యూత్ ని అలరిస్తుంది. గతంలో మేము విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ బాగా ఆదరించారు. ఇప్పుడు విడుదల చేసిన టీజర్‌కి ఇంకా బాగా రెస్పాన్స్ వస్తోంది. ఎంతలా అంటే... 10 రోజుల్లో మా సినిమా బిజినెస్‌ని క్లోజ్ చేసే అంతలా. Also Read: ఈ టీజర్ వల్ల బయ్యర్స్ నుంచి ఆఫర్ వచ్చింది. హీరోయిన్‌లు దివ్య రావ్, ఆస్మ చాలా బాగా నటించారు. వీళ్ళతో పనిచేయడం నాకు కంఫర్ట్ అనిపించింది. ఫస్ట్ టైం నటిస్తున్నాననే ఫీలింగ్ లేకుండా చేశారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి ఎంతో బిజీగా ఉన్నా మా సినిమాలో నటించి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన చేసిన కామెడీ సినిమాలో హైలైట్. ఎంతో హెల్దీగా తన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. ఆయకు ధన్యవాదాలు. ఇది మహిళల ఇమేజ్‌ని పెంచే ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా. రొమాన్స్ విషయంలో మహిళల ఫీలింగ్స్ ఏంటి అని చాలా సున్నితంగా తెరమీద చూపించాం. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటరైటన్‌ చేస్తాడు మా Tempt రాజా’’ అని అన్నారు. నిజానికి టీజర్‌లో అడల్ట్ కంటెంట్ తప్ప మరేం లేదు. ఆఖరికి పోసాని కృష్ణమురళితో కూడా బూతు డబల్ మీనింగ్ డైలాగులు చెప్పించేశారు. ఇక టీజర్‌లో సన్నివేశాలు, డైలాగులు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ‘మింగుతావా.. మమ్మల్ని మింగేయమంటావా’ అంటూ ప్రస్తుతం యూత్‌లో బాగా పాపులర్ అయినా డైలాగ్‌తో బూతును పండించారు. మొత్తానికి దీన్ని సందేశాత్మక చిత్రం అని చెప్పుకున్నా ఇందులో బూతే హైలైట్ అవుతోంది. ఈ సినిమాలో యాంకర్ శ్యామల, టార్జెన్, జయవాణి, జోగి బ్రదర్స్ (కృష్ణ, నాయుడు) గౌతంరాజు, అశోక్ కుమార్, మేఘన చౌదరి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ దొరబాబు, మైత్రి రజిత, దీప్తి ఇతర పాత్రలు పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m9rD8w
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...