Sunday, 1 November 2020

Sai Dharam Tej: మెగా మేనల్లుడితో కుదరదన్న గ్లామర్ బ్యూటీ.. ఆమె కాదనడంతో డిసైడ్ అయ్యారిలా!

కరోనా విలయతాండంవంతో హీరోహీరోయిన్లు వేసుకున్న ప్లాన్స్, దర్శకనిర్మాతలకు ఇచ్చిన డేట్స్ అన్నీ తలక్రిందులయ్యాయి. దాదాపు ఆరు నెలలకు పైగా షూటింగ్స్ లేక ఇంట్లోనే ఉండటంతో అప్పటికే కమిటైన అన్ని సినిమాలు అటకెక్కాయి. ఇక ఇప్పుడు లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్‌కి అనుమతి రావడంతో వరుసగా అన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన కమిట్‌మెంట్స్‌లో కొన్ని మార్పులు తప్పడం లేదు. తాజాగా యంగ్ హీరోయిన్ డేట్స్ అడ్జస్ట్ కాక మెగా మేనల్లుడి సినిమా నుంచి తప్పుకుందట. లాక్‌డౌన్‌కి ముందే చాలా సినిమాలకు కమిటై ఉందట యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్. ఈ మధ్యే షూటింగ్స్ ప్రారంభం కావడంతో అన్ని ప్రాజెక్ట్స్ ఒకేసారి హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి నెలకొందట. దీంతో డేట్స్ అడ్జెస్ట్‌మెంట్ చాలా కష్టమవుతోందని భావించిన ఈ బ్యూటీ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో చేయబోతున్న కొత్త సినిమా క్యాన్సిల్ చేసుకుందని ఫిలిం నగర్ టాక్. బిజీ షెడ్యూల్‌లో డేట్స్ క్లాష్ అవుతున్నాయనే కారణంగా ఈ నిర్ణయం తీసుకుందట నివేదా పేతురాజ్. Also Read: హీరోగా దేవాకట్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన నివేదా పేతురాజ్ చివరి క్షణంలో డ్రాప్ అయిందట. దీంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో అన్ని హంగులతో ఈ సినిమా రూపొందనుందని, ఈ చిత్రానికి 'రిపబ్లిక్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు మరో వార్త వైరల్ అవుతోంది. భగవాన్, జె.పుల్లారావు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో కనిపించనుందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HTfqGm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...