Sunday, 8 November 2020

Namrata Shirodkar: ఇది చాలా రేర్ అంటూ గత జ్ఞాపకాన్ని బయటపెట్టిన మహేష్ సతీమణి.. అంతా మగవాళ్లే!!

నిత్యం సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటూ తన కుటుంబ విషయాలతో పాటు వ్యక్తిగత అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది సతీమణి . భర్త మహేష్ కంటే నమ్రతనే సూపర్ స్టార్ అభిమానులతో ఎక్కువగా టచ్‌లో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మధ్యకాలంలో షూటింగ్స్ లేకపోవడంతో గత జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ ఆసక్తి రేకెత్తిస్తోంది నమ్రత. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన త్రో బ్యాక్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. తన భర్త సూపర్ స్టార్ మహేష్ బాబు, కొడుకు గౌతమ్‌లతో పాటు వాళ్ల పెంపుడు కుక్క ఓకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్న ఫోటోని పోస్ట్ చేసిన నమ్రత.. ''ఇంట్లో అంతా మగవాళ్లే'' అంటూ క్రేజీ క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ పిక్ వెంటనే వైరల్ కావడమే గాక సూపర్ స్టార్ అభిమానులను యమ అట్రాక్ట్ చేస్తోంది. ''స్వీట్ మెమోరీస్, సూపర్ వదినమ్మా, మా హీరో ఏజ్ రివర్స్ గేర్‌‌లో వెళ్తోంది'' అని కామెంట్స్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. Also Read: గత కొన్ని రోజులుగా మహేష్ బాబుకు సంబంధించిన పాత ఫొటోలతో స్పెషల్ ట్రీట్ ఇస్తున్న నమ్రత.. ఇటీవలే వారి పెళ్లి ఫొటోను కూడా షేర్ చేసింది. పెళ్లి అనంతరం నమ్రత, మహేష్‌లు వారిరువురి తల్లిదండ్రులతో కలిసి తీసుకున్న ఫొటో షేర్ చేసి ఆకట్టుకుంది. అలాగే కరోనాకి ముందు సమ్మర్‌ వెకేషన్‌కి వెళ్లిన సమయంలో మహేష్ బాబు దిగిన ఓ రేర్ పిక్ కూడా అభిమానుల ముందుంచింది. ఇకపోతే ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో సక్సెస్ అందుకున్న మహేష్ బాబు.. మరికొద్ది రోజుల్లో 'సర్కారు వారి పాట' సినిమా రెగ్యులర్ షూట్‌లో పాల్గొనబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U2uCmW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...