Thursday, 5 November 2020

Jr. Ntr నిన్ను వాడలేదా అని డైరెక్టుగా అడిగారు.. ఓపెన్ అయిన పాయల్! తారక్ క్యారెక్టర్ ఇదే అంటూ..

లాక్‌డౌన్ వేళ బాలీవుడ్‌ ఫేమస్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌‌పై లైంగిక ఆరోపణలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ మరోసారి ఓపెన్ అయింది. లాక్‌డౌన్ కంటే ముందే విషయమై మీరా చోప్రాతో వైరం పెట్టుకున్న ఆమె.. తాజాగా మరోసారి అదే ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి పోస్ట్ చేస్తూ అనురాగ్‌ కశ్యప్‌తో ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఈ మేరకు ఎన్టీఆర్ గురించి ఆమె చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి తన ఇంటికి పిలిపించుకుని లైగిక దాడికి పాల్పడ్డారంటూ అనురాగ్‌ కశ్యప్‌పై సంచలన ఆరోపణలు చేయడమే గాక ఈ ఇష్యూని ప్రధాని వద్దకు కూడా తీసుకెళ్లిన పాయల్ మరోసారి అదే అనురాగ్‌ కశ్యప్ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. ఆయన ఎన్టీఆర్‌పై కూడా నీచమైన కామెంట్స్ చేశాడని చెప్పింది. ఎన్టీఆర్ కూడా నిన్ను వాడాడు.. సతీ సావిత్రిలా ఎక్కువగా నటించకు అంటూ వల్గర్‌గా మాట్లాడారని ఓపెన్ అయింది. Also Read: అయితే ఎన్టీఆర్ గురించి అనురాగ్‌ కశ్యప్‌కి, తనకు మధ్య చర్చ ఎందుకొచ్చిందో తెలిపిన పాయల్ ఘోష్ ఆ రోజు జరిగిన సంఘటనను వివరంగా చెప్పింది. హసీతో ఫసి సినిమా చర్చల్లో భాగంగా అనురాగ్‌తో మాట్లాడుతుండగా.. టీవీలో ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' మూవీ వస్తోంది. అయితే రిఫరెన్స్ కోసం ఆ మూవీని అనురాగ్‌కి చూపించమని మేనేజర్ చెప్పడంతో తమ మధ్య ఆయన చర్చ వచ్చిందని, ఆ సమయంలోనే ఎన్టీఆర్ గురించి అనురాగ్ నీచంగా కామెంట్స్ చేయడం బాధపెట్టిందని పేర్కొంది పాయల్ ఘోష్. ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ ఎలాంటివాడో స్పష్టంగా తెలిపింది పాయల్. అనురాగ్ అనుకున్నట్లుగా ఎన్టీఆర్ తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని చెప్పింది. అంతేకాదు దక్షిణాది స్టార్స్ వద్దే తనకు వాతావరణం కనిపించిందని ఆమె పేర్కొనడం గమనార్హం. దీంతో పాయల్ చేసిన ఈ కామెంట్స్ మరోసారి ఆన్‌లైన్ వేదికల్లో చర్చలకు కారణమయ్యాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mYCqCF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...