Friday, 27 November 2020

‘F3’కి రూ.70 కోట్ల బడ్జెట్.. ‘F2’తో పోలిస్తే రెండింతలు.. కారణాలు ఇవే!!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘F2’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ తీస్తున్నట్టు అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించారు. దీనికి ‘F3’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమా డిసెంబర్ 14న లాంఛనంగా ప్రారంభం కాబోతోందని ఇండస్ట్రీలో వర్గాలు అంటున్నాయి. ‘F2’లో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ‘F3’లోనూ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. వీరితో పాటు మరో హీరో కూడా ఉంటారని టాక్. దీని గురించి అయితే ప్రస్తుతానికి స్పష్టత లేదు. కాకపోతే, ‘F2’కి మించిన వినోదం ‘F3’లో ఉంటుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించి ఇండస్ట్రీలో కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయి. Also Read: ‘F2’ సినిమాను నిర్మాత దిల్ రాజు సుమారు రూ.35 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం ఏకంగా రూ.81 కోట్ల థియేట్రికల్ షేర్‌ను వసూలు చేసింది. దిల్ రాజు కెరీర్‌లో అత్యధిక లాభం చేకూర్చిన సినిమా ఇది. అందుకే, అనిల్ రావిపూడి మీద నమ్మకంతో ‘F3’ సినిమాకు బడ్జెట్‌ను డబుల్ చేశారట దిల్ రాజు. ఏకంగా రూ.70 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారట. అయితే, బడ్జెట్ డబుల్ కావడానికి కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. ‘F2’ సినిమా సమయానికి వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి.. ముగ్గురూ రెమ్యునరేషన్ తక్కువగానే తీసుకున్నారట. అయితే, అనిల్ రావిపూడి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండటంతో రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందని టాక్. ఇక ‘F2’, ‘వెంకీ మామ’ సినిమాలతో జోరందుకున్న వెంకటేష్ కూడా తన పారితోషికాన్ని స్వల్పంగా పెంచారట. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ పెంచినట్టు ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. వీళ్లతో పాటు ‘F3’లో ఇంకొంత మంది స్టార్లు కనిపించనున్నారట. అందుకే, బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఈ వార్తల్లో నిజం ఉందో లేదో!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36cxrZo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...