దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన 'ఛత్రపతి' సినిమా బాక్సాఫీస్ దుమ్ముదులిపిన సంగతి తెలిసిందే. 2005 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌ని మలుపుతిప్పిన చిత్రంగా నిలిచింది. టాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ సాధించి కాసుల వర్షం కురిపించింది. అయితే ఇన్నేళ్లకు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. అంతేకాదు ఈ పవర్‌ఫుల్ సినిమాతో తెలుగు యంగ్ హీరో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. అల్లుడు శీను సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు ఈ `ఛత్రపతి` హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇటు బెల్లంకొండకు అటు వీవీ వినాయక్‌కు ఇద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా కానుంది. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి జయంతిలాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మాతృకకు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం. Also Read: టాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్‌లో నటించే అవకాశం రావడం పట్ల బెల్లంకొండ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ మూవీతో తన బాలీవుడ్ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అలాగే తనను 'అల్లుడు శీను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ పట్ల ఆయన పూర్తి నమ్మకంగా ఉన్నారు. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/367TnVJ
v
No comments:
Post a Comment